'రంగ‌స్థ‌లం' కొత్త ట్రైల‌ర్‌

Sat,April 14, 2018 10:12 AM
Rangasthalam Latest Trailer

గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ప్ప‌టికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ని అందుకున్న చిత్రం రంగ‌స్థ‌లం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత హీరోహీరోయిన్స్‌గా న‌టించారు. మార్చి 30న విడుద‌లైన ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్స్ సాధించే దిశ‌గా అడుగులు వేస్తుంది. జ‌గ‌ప‌తి బాబు,ప్ర‌కాశ్ రాజు, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అయితే ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ అయిన కార‌ణంగా ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు రంగ‌స్థ‌లం మేకర్స్ విజ‌యోత్సవ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. సినిమా రిలీజ్‌కి ముందు ట్రైల‌ర్ విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచిన టీం, రిలీజ్ అయి ఇంత పెద్ద విజ‌యం సాధించిన త‌ర్వాత కూడా ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. మూడు నిమిషాల న‌ల‌భై సెక‌న్ల ఈ వీడియో సినీ ల‌వ‌ర్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం, చంద్ర బోస్ సాహిత్యం, ర‌త్న‌వేలు ఫోటోగ్రఫీ సినిమాని ఎక్క‌డికో తీసుకెళ్ళాయి. మ‌రి తాజాగా విడుద‌లైన కొత్త ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

5779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles