రంగ‌స్థ‌లం 1985 చిత్ర ఫ‌స్ట్ లుక్‌కి టైం ఫిక్స్‌

Thu,December 7, 2017 10:17 AM
రంగ‌స్థ‌లం 1985 చిత్ర ఫ‌స్ట్ లుక్‌కి టైం ఫిక్స్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, లెక్క‌లు మాస్టారు సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌చిత్రం రంగ‌స్థ‌లం 1985. శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ సినిమా కోసం రూ.5 కోట్ల‌తో ఓ గ్రామం సెట్ వేశారు. ఇందులో ప‌లు స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని భావిస్తున్న టీం రేపు సాయంత్రం 5.30ని.ల‌కు చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం వ‌ర్కింగ్ స్కిల్స్ మాత్ర‌మే విడుద‌ల కాగా, ఫ‌స్ట్ లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై అభిమానుల‌లో ప‌లు ఊహాగానాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో అన‌సూయ‌, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టిలు కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు.

816

More News

VIRAL NEWS