ఈ యాక్టర్ డ్రగ్స్ తీసుకున్నాడట..

Mon,July 17, 2017 05:59 PM
ranbir kapoor used drugs in rockstar movie shooting


ముంబై: తన నటనతో బాలీవుడ్ టాప్ స్లార్లలో ఒకడిగా నిలిచాడు యాక్టర్ రణ్‌బీర్ కపూర్. త్వరలో బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ బయోపిక్‌లోనూ రణ్‌బీర్ లీడ్ రోల్‌లో స్క్రీన్‌పై కనిపించనున్నాడు. డిఫరెంట్ మూవీస్‌తో స్టార్‌డమ్ సంపాదించుకున్న రణ్‌బీర్‌కు ఓ సమయంలో డ్రగ్స్ వాడే పరిస్థితి వచ్చిందట. ఈ విషయాన్ని రణ్‌బీర్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. 2011లో వచ్చిన రాక్‌స్టార్ సినిమా కోసం స్వల్పమోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్లు రణ్‌బీర్ చెప్పాడు. రణ్‌బీర్ కపూర్ స్టేజిపై మందు తాగిన వాడిగా నటించే సీన్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పనిచేసినట్లు చెప్పాడు. స్టేజిపై వచ్చే సీన్ నేచురల్‌గా ఉండాలనే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించాడు రణ్‌బీర్. తనకు చిన్నపుడు డ్రగ్స్ వాడే అలవాటు ఉండేదని, అయితే ఆ అలవాటు ఇప్పుడు లేదని క్లారిటీ ఇచ్చాడు రణ్‌బీర్.
ranbir-drugs2

5702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS