ఆ హీరోకు ఫుల్ డిమాండ్.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ డబుల్

Wed,July 25, 2018 01:39 PM
Ranbir Kapoor doubles his brand endorsement value after Sanju success

బాక్సాఫీస్ దగ్గర సంజు మూవీ సక్సెస్‌తో రణ్‌బీర్ కపూర్‌కు ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో తన డిమాండ్‌కు తగినట్లు అతను భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నాడు. తన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ను ఒకేసారి రెట్టింపు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాను ప్రమోట్ చేయాలనుకుంటున్న బ్రాండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే రణ్‌బీర్.. రానున్న వారాల్లో కొన్ని కమర్షియల్స్ షూటింగ్‌లో పాల్గోనున్నాడు. యూత్‌లో రణ్‌బీర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అతని వైఫల్యాలు తన బ్రాండ్ వాల్యూను ఏమాత్రం తగ్గించలేదు. కానీ తాజాగా సంజూ హిట్‌తో వాల్యూ రెట్టింపయ్యింది అని అతని సన్నిహితుడొకరు చెప్పారు.

ఇప్పటివరకు రణ్‌బీర్ ఒక రోజు వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు తీసుకునేవాడు. ఇప్పుడు దానిని రూ.6 కోట్లకు పెంచేశాడు. ప్రస్తుతం రణ్‌బీర్ ఏషియన్ పెయింట్స్, పెప్సీ, పానాసోనిక్, రెనాల్ట్, ఫ్లిప్‌కార్ట్, మాక్రోమాన్, సావన్, హీరో మోటోకార్ప్‌లాంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే తన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వాల్యూను రెట్టింపు చేసినా.. మిగతా ఇండియన్ సెలబ్రిటీలతో పోలిస్తే రణ్‌బీర్ ఇప్పటికే చాలా వెనుకబడే ఉన్నాడు. ఈ లిస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రూ.912 కోట్ల టాప్‌లో ఉండగా.. షారుక్‌ఖాన్ (678 కోట్లు), దీపికా పదుకోన్ (595 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

3420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles