ఆసుపత్రి బ‌య‌ట కెమెరాకి చిక్కిన అలియా, ర‌ణ్‌బీర్

Wed,November 21, 2018 12:32 PM
Ranbir Kapoor Accompanies Alia Bhatt

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ..మ‌హేష్ గారాల ప‌ట్టి అలియా భ‌ట్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై గ‌తంలో రణ్‌బీర్ వీరి ప్రేమాయ‌ణంపై కొంత క్లారిటీ ఇవ్వ‌గా, రీసెంట్‌గా అలియా కూడా నోరు విప్పింది. ప్రస్తుతం ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌కి అలియా, రణవీర్‌ మకాం మార్చి రొమాన్స్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. దీనిపై రీసెంట్‌గా స్పందించిన అలియా.. అభిమానులు, ప్రేక్షకులు నిజంగా నా పెళ్లి కోసం అంత ఆత్రుతగా ఉంటే.. ఇంకొంతకాలం అలాగే ఓపికగా ఎదురు చూడండి. క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుంది. హ్యాపీ ఎండింగ్‌ ఇస్తాం అని అన్నారు. తాజాగా ఈ క‌పుల్ బాంద్రాలోని ఓ క్లినిక్ బ‌య‌ట కెమెరా కంట ప‌డ్డారు. బ్ర‌హ్మ‌స్త్రా చిత్ర షూటింగ్ స‌మ‌యంలో అలియా భ‌ట్ గాయ‌ప‌డ‌గా, అప్ప‌టి నుండి విశ్రాంతి తీసుకుంటుంది. చెక‌ప్ కోసం ర‌ణ్‌బీర్‌.. అలియాని క్లినిక్‌కి తీసుకెళ్లిన‌ట్టు తెలుస్తుంది . కెమెరా కంట ప‌డ‌కుండా వెళ్ళాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి అది సాధ్యం కాలేదు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ర‌ణ్‌బీర్, అలియా భ‌ట్ తొలిసారి బ్ర‌హ్మాస్త్రా చిత్రంలో క‌లిసి న‌టిస్తుండ‌గా, ఈ మూవీ అతి త్వ‌రలోనే విడుద‌ల కానుంది.3994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles