ర‌ణ‌రంగం మేకింగ్ వీడియో

Wed,August 14, 2019 01:40 PM
Ranarangam Movie Making video released

శర్వానంద్‌,కల్యాణీ ప్రియదర్శన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం ర‌ణ‌రంగం. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ప్రశాంత్‌ పిైళ్లె సంగీతం అందించ‌గా, ఇటీవ‌ల సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు.ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది . స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 1980 బ్యాక్‌డ్రాప్‌ నుంచి నేటి వరకు సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. సినిమాలో శర్వానంద్‌ రెండు భిన్న పాత్రల్లో అలరించ‌నున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో సినిమాకి సంబంధించి కొన్ని కీలక స‌న్నివేశాల మేకింగ్ చూపించారు. మీరు వీడియోపై ఓ లుక్కేయండి.

824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles