‘ఎన్టీఆర్’ చిత్రం చేయడానికి కారణమదే..

Wed,September 19, 2018 07:38 PM
rana told why he was accept NTR project

లీడర్ సినిమాతో మొదలుకొని బాహుబలి సిరీస్‌ల వరకు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్లో తనదైన ముద్రవేసుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ రానా. ఈ ‘భల్లాలదేవుడు’ తాజాగా ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న‘ఎన్టీఆర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రానా ఈ మూవీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా జాతీయ మీడియాతో రానా చిట్‌చాట్ చేశాడు. నేను హాథీ మేరీ సాథీ (హిందీ చిత్రం), ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నా. ఎన్టీఆర్ చాలా పెద్ద ప్రాజెక్ట్. నాకు ఇలాంటి సినిమాలు చేయడమంటే ఇష్టం. అందువల్లే ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నా. ఈ చిత్రంలో నేను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రలో కనిపిస్తా. సినిమా షూటింగ్ పూర్తయే దశలో ఉందన్నాడు.

4746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles