స్వీటీ సినిమాలో రానా కీలకపాత్ర..?

Sun,February 17, 2019 07:40 PM
Rana to plays key role in anushka movie

అనుష్క, రానా కాంబినేషన్‌లో ఇప్పటికే ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘రుద్రమదేవి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జోడీ మరోసారి తెరపై సందడి చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న కొత్త ప్రాజెక్టు ‘సైలెంట్‌’ లో రానా కీలక పాత్ర కనిపించనున్నట్లు టాక్. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ యూఎస్ లో షురూ కానుంది. ఈ మూవీలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు, ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

2741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles