2.0 ఆడియో లాంఛ్‌కి హోస్ట్ ఎవరో తెలిసింది..

Thu,October 26, 2017 06:07 PM
Rana To host 2.0 Movie audio Launch event


దుబాయ్: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబో మూవీ 2.0 ఆడియో లాంఛ్‌కి అంతా సిద్ధమైంది. రేపు దుబాయ్‌లోని బుర్జ్ పార్క్‌లో గ్రాండ్‌గా ఆడియో లాంఛ్ ఈవెంట్ జరుగనుంది. శంకర్, రజనీ అండ్ టీం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకుని ప్రెస్‌మీట్ కూడా ఏర్పాటు చేసింది. అభిమానులను మెస్మరైజ్ చేసేలా గ్రాండ్‌గా నిర్వహించే ఆడియో వేడుకకు ‘భల్లాలదేవుడు’ రానా హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని రానా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. భారత సినిమా చరిత్రలోనే జరుగుతున్న బిగ్గెస్ట్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా చేసేందుకు దుబాయ్‌లో ఉన్నానని ట్వీట్ చేశాడు రానా. లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ సుమారు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో 2.0ను తెరకెక్కిస్తున్నది. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు.1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS