సైడ్ క్యారెక్ట‌ర్స్ చేయోద్ద‌న్నందుకు రానా స‌మాధానం ఏంటో తెలుసా ?

Sat,August 4, 2018 01:36 PM
rana sensational reply to netigen question

లీడ‌ర్ సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన రానా ఒక‌వైపు లీడ్ రోల్స్ చేస్తూనే మ‌రో వైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నాడు. బాహుబ‌లి సినిమాలో భ‌ళ్ళాల‌దేవుడి పాత్ర పోషించిన రానాకి దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న రానా ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఏన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబు పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. శుక్ర‌వారం ద‌ర్శ‌కుడు క్రిష్‌, న‌టుడు బాల‌య్య‌తో క‌లిసి ఏపి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడిని క‌లిసిన రానా వారితో క‌లిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోల‌కి ఓ నెటిజ‌న్ ‘సైడ్ క్యారెక్టర్లు చేయకండి రానాగారూ’ అని కామెంట్ చేశాడు. దీనికి రానా దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చాడు. ‘‘ఎన్టీయార్ జీవిత‌చ‌రిత్ర‌లో ఓ చిన్న పాత్ర చేయ‌డం కూడా చాలా గొప్ప‌ది’’ అంటూ రానా బ‌దులిచ్చాడు. ఆయ‌న స‌మాధానానికి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ఈ ఉదయం కృష్ణా జిల్లా నిమ్మకూరులో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొని రెండో షెడ్యూల్‌కి సిద్ద‌మైంది. ఎన్టీఆర్ చిన్నప్పటి ఇల్లు, ఆయన తిరిగిన వీధులు , చ‌దివిన స్కూల్ వంటి అంశాల‌ని చిత్రీక‌రించి సినిమాలో చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాలన్ క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

2986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles