నానా ప‌టేక‌ర్ స్థానంలో రానా

Tue,October 23, 2018 10:29 AM
rana replaced with nana patekar

ఇండియాలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న మీటూ ఉద్య‌మం వ‌ల‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌టులని సినిమా నుండి త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌ నటి సలోని చోప్రా హౌజ్ ఫుల్ 4 ద‌ర్శ‌కుడు సాజిద్‌ ఖాన్‌పై ఇటీవ‌ల‌ సంచలన ఆరోపణలు చేసింది. అలానే చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నానా ప‌టేక‌ర్‌పై చిన్మ‌యి లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. ఈ క్రమంలో హౌస్ ఫుల్ 4 నుండి వీరిద్ద‌రిని చిత్ర యూనిట్ తొల‌గించింది. చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న అక్ష‌య్ కుమార్ ఇటీవ‌ల హౌజ్ ఫుల్ 4 నిర్మాత‌ల‌కి ఫోన్ చేసి అనుమానితులుగా ఉన్న వారి విచార‌ణ పూర్త‌య్యే వర‌కు సినిమా షూటింగ్ నిలిపివేయాల‌ని కోరాడు. ఈ స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎంతైన అవ‌స‌రం అని పేర్కొన్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నానా ప‌టేక‌ర్ స్థానంలో రానా న‌టించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక ద‌ర్శ‌కుడిగా ఫ‌హ‌ద్ సంజీ ఎంపిక అయ్యాడ‌ని స‌మాచారం. సాజిద్ న‌డియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది థియేట‌ర్స్‌లోకి రానుంది. అక్ష‌య్ కుమార్‌, కృతి స‌నన్, రితేష్ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే, బాబి డియోల్‌, కృతి క‌ర్భందా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

2434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles