రానాకి కంటి ఆప‌రేష‌న్‌

Sun,June 3, 2018 10:35 AM
rana operation at united states

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా ద‌గ్గుబాటి. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రానా త్వ‌ర‌లో త‌న కుడి క‌న్ను ఆప‌రేష‌న్ చేయించుకోనున్నాడ‌ట‌. ఎప్ప‌టి నుండో రానా కుడి క‌న్ను స‌రిగా క‌నిపించ‌దు. ఈ విష‌యాన్ని ఓ షోలో కూడా చెప్పాడు . అయితే కొన్ని వారాలు షూటింగ్‌కి బ్రేక‌ప్ ఇచ్చి యూఎస్‌లో కంటి ఆప‌రేష‌న్‌కి రానా వెళ్ళ‌నున్నాడ‌ని సురేష్ బాబు ఇటీవ‌ల ఓ ఇంగ్లీష్ మీడియాకి చెప్పారు. ఆప‌రేష‌న్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. చివ‌రిగా నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపధ్యంలో ‘1945’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయ‌నున్నాడు . ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించనున్నాడు . ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది. 1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఇవే కాక గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్యకశ్యప అనే చిత్రం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. బాల డైరెక్షన్లోను రానా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. వీటి త‌ర్వాత నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన తేజ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడు రానా. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాలో రానా ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించ‌నున్నాడ‌ని అంటున్నారు.

4178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles