రానా చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్

Fri,December 29, 2017 04:17 PM
rana next with national director

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ డం అందుకున్నాడు రానా. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపధ్యంలో ‘1945’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు రానా. ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించనున్నాడు . ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది. వీటితో పాటు 1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఇవే కాక గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్యకశ్యప అనే చిత్రం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం తమిళ సినీ పరిశ్రమలో విప్లవాత్మక సినిమాల దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న బాల డైరెక్షన్లోను రానా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అర్జున్ రెడ్డి చిత్రాన్ని ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు బాల. ఈ మూవీ తర్వాత రానా ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నట్టు టాక్. ఈ మూవీలో శ్రద్దా శ్రీనాథ్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

1764
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles