180 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న రానా చిత్రం

Sun,July 15, 2018 11:29 AM
rana next with high budjet

మొన్నటివరకూ లీడర్ గా అందరి మనసుల్లో గుర్తుండిపోయిన రానా ఇప్పుడు భల్లాలదేవుడిగా అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్నాడు. దాంతో అతనికి చారిత్రక, పౌరాణిక పాత్రలు చేసే అవకాశాలు కూడా వస్తున్నాయి. రుద్రమదేవి డైరెక్టర్ గుణశేఖర్ తను తీయబోయే పౌరాణిక చిత్రంలో హిరణ్యకశిపుడిగా రానాను ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. హిరణ్యకశిపు అనే టైటిల్ తో గుణశేఖర్ తెరకెక్కించనున్న మైథలాజికల్ మూవీకి దాదాపు 180 కోట్ల వరకు ఖర్చు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సురేష్ బాబు నిర్మాణంలో రూపొంద‌నుండ‌గా, వ‌చ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేశ్ సింగ్ తో ఈ సినిమాకి అవసరమైన రాజప్రాసాదాలు .. మంటపాలు .. దేవలోకం .. వైకుంఠం .. ఉద్యానవనాలు వంటి సెట్స్ ను గీయిస్తున్నారట . విజువల్ వండ‌ర్‌లా సినిమాని తీర్చిదిద్దాల‌ని గుణ‌శేఖ‌ర్ భారీ క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

2784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles