రానా బాలీవుడ్ క్లాసిక్ రీమేక్ టైటిల్ లోగో విడుద‌ల‌

Thu,December 14, 2017 12:10 PM
rana new movie first look

ఒకే చ‌ట్రంలో ఇరుక్కోకుండా కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న హీరో రానా ద‌గ్గుబాటి. కేవ‌లం తెలుగుకే ప‌రిమితం కాకుండా బ‌హుభాషా న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ప్ర‌స్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలోని ఓ సైనికుడి ప్రేమ కథ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రానా నేతాజీ సైన్యంలోని సిపాయిగా కనిపించనున్నట్టు సమాచారం. ఇది 1945వ సంవత్సరానికి సంబంధించిన కథ కాగా, అప్పటి కాలంలో జరిగిన కొన్ని సంఘటనలని మన కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ఈ సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించ‌నున్నాడు రానా. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఏక‌కాలంలో రూపొంద‌నుంది. వీటితో పాటు 1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. రాజేశ్ ఖన్నా, తనూజ ప్రధాన పాత్రలో హథీ మేరీ సాథీ అనే చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగు, తమిళం , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో ఏకకాలంలో రూపొందించబోతున్నాడు దర్శకుడు సోలొమాన్. ట్రినిటీ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. 2018 జనవరి నుండి భారత్, థాయ్ లాండ్ లలో మూవీ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది. దీపావళికి ప్రేక్షకులకు ముందుకు తేవాలని టీం భావిస్తుంది. అయితే ఈ రోజు రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినిమా టైటిల్ లోగోను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ ను న్యూ ఇయర్ కానుకగా 2018 జనవరి 1న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.1299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles