సీఎం లుక్ లో రానా.. వైరల్ గా మారిన లీక్డ్ పిక్

Fri,September 7, 2018 04:04 PM
rana looks different as chandrababu

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని బాలయ్య పోషిస్తుండగా, ఆయన సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుంది. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి,ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా , ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళ నటి మంజిమో మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు అని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ జీవిత చరిత్రలో కీలక పాత్ర అయిన చంద్రబాబు నాయుడిగా రానా నటిస్తుండగా, ఆ పాత్ర కోసం పూర్తి స్లిమ్ గా మారి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు రానా. బాహుబలి చిత్రంలో భారీ శరీర సౌష్టవంతో కనిపించిన రానా ఇప్పుడు క్లీన్ షేవ్ తో మీసాలు పెంచి బాబు గెటప్ లో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు రానా. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో గత రెండు రోజులుగా చిత్ర షూటింగ్ జరుగుతుండగా, రీసెంట్ గా లొకేషన్ కి సంబంధించిన పిక్ లీక్ అయింది. ఇందులో రానాని చూస్తుంటే ఆయన పూర్తిగా చంద్రబాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపిస్తుంది. మరి వెండితెరపై చంద్రబాబుగా రానా ఏ రేంజ్ లో అదరగొడతాడో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది.

3449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles