ఎన్టీఆర్ లో రానా లుక్ ఇదే..!

Wed,September 12, 2018 03:33 PM
rana look revealed from ntr

బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన నటుడు రానా. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రానా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రంలో ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్నాడు. ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబు పాత్ర కోసం తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు రానా. ఇటీవల షూటింగ్ లో రానాకి సంబంధించిన స్టిల్స్ విడుదల కాగా, ఇవి ప్రేక్షకులకి ఎంతో ఆనందాన్ని అందించాయి. తాజాగా వినాయక చవితి శుభాకాంక్షలతో ఎన్టీఆర్ లో రానా లుక్ ని విడుదల చేశారు. యంగ్ ఏజ్ లో చంద్రబాబు ఎలా ఉన్నారో అచ్చం రానా కూడా అదే లుక్ లో కనిపిస్తున్నాడు. ఈపిక్ అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళుతుంది.

ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని బాలయ్య పోషిస్తుండగా, ఆయన సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుంది. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు అని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది.

2081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles