ఏపీ సీఎంతో రానా, క్రిష్, బాలయ్య

Mon,August 6, 2018 04:01 PM
Rana, krish met AP CM Chandrababunaidu

క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు బయోపిక్ ఎన్టీఆర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో రానా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో రానా, క్రిష్, బాలయ్య సీఎం చంద్రబాబును కలిశారు. ఈ విషయాన్ని రానా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబునాయుడుతో పలు విషయాలపై చర్చించారు. సీఎం నారా చంద్రబాబునాయుడు పాత్రలో నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు రానా.
1955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS