క్రిష్, బాలయ్యతో రానా..

Fri,August 3, 2018 08:12 PM
rana joins with NTR Team here is the pic

ఎన్టీఆర్ బయోపిక్ స్టార్స్ చేరికతో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమవ్వగా తాజాగా మరోస్టార్ వారితో జతకలిసాడు. రానా ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించనున్నారు. దివంగత మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది.

బాలకృష్ణ, క్రిష్‌లతో కలిసి వున్న ఓ ఫొటోను రానా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అనితర సాధ్యుడైన ఓ మహోన్నత వ్యక్తి కథను కలిసి చెప్పబోతున్నాం. ఆయనే ఎన్టీఆర్ అని రానా పేర్కొన్నారు. ఇందులో రానా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. బాలకృష్ణ, విద్యాబాలన్ తదితరులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

1201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles