అఫీషియ‌ల్: నానా ప‌టేక‌ర్ స్థానంలో రానా

Thu,November 1, 2018 11:41 AM
Rana Daggubati replaces Nana Patekar in Housefull 4

ఇండియాలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న మీటూ ఉద్య‌మం వ‌ల‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌టులని సినిమా నుండి త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌ నటి సలోని చోప్రా హౌజ్ ఫుల్ 4 ద‌ర్శ‌కుడు సాజిద్‌ ఖాన్‌పై ఇటీవ‌ల‌ సంచలన ఆరోపణలు చేసింది. అలానే చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నానా ప‌టేక‌ర్‌పై చిన్మ‌యి లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. ఈ క్రమంలో హౌస్ ఫుల్ 4 నుండి వీరిద్ద‌రిని చిత్ర యూనిట్ తొల‌గించింది. చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న అక్ష‌య్ కుమార్ ఇటీవ‌ల హౌజ్ ఫుల్ 4 నిర్మాత‌ల‌కి ఫోన్ చేసి అనుమానితులుగా ఉన్న వారి విచార‌ణ పూర్త‌య్యే వర‌కు సినిమా షూటింగ్ నిలిపివేయాల‌ని కోరాడు. ఈ స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎంతైన అవ‌స‌రం అని పేర్కొన్నాడు. అయితే నానా ప‌టేక‌ర్ స్థానంలో రానాని ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యాన్ని రానా క‌న్‌ఫాం చేశాడు. హైద‌రాబాద్ వెలుప‌ల ప‌ని చేయ‌డం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. దీని వ‌ల‌న కొత్త విష‌యాలు నేర్చుకుంటాం. హౌజ్‌ఫుల్ చిత్రం లాంటి జాన‌ర్‌లో నేనెప్పుడు పని చేయ‌లేదు. వినూత్నమైన చిత్రాల‌లో ప‌నిచేయ‌డం నాకు ఎంతో ఉత్తేజంగా ఉంటుందని రానా పేర్కొన్నాడు. ఈ వారంలోనే రానా టీంతో క‌ల‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రానికి ద‌ర్శ‌కుడిగా సాజిద్‌ ఖాన్ స్థానంలో ఫ‌హ‌ద్ సంజీ ఎంపిక అయ్యాడ‌ని స‌మాచారం. సాజిద్ న‌డియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది థియేట‌ర్స్‌లోకి రానుంది. అక్ష‌య్ కుమార్‌, కృతి స‌నన్, రితేష్ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే, బాబి డియోల్‌, కృతి క‌ర్భందా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

1644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles