రానా హిట్ చిత్రాలు జ‌పాన్‌లో విడుద‌ల‌

Wed,May 22, 2019 12:30 PM
Rana Daggubati hit movies Set To Screen In Japan

బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన చిత్రాలు జపాన్‌లో విడుద‌ల కాగా, ఆ చిత్రాల‌కి ప్రేక్ష‌కుల నుండి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. అంతేకాదు చిత్రాన్ని తెర‌కెక్కించిన రాజ‌మౌళి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ప్ర‌భాస్‌, రానాల‌తో పాటు ముఖ్య పాత్ర‌లు పోషించిన కొంద‌రిపై జ‌పాన్ అభిమానులు తెగ ప్రేమ కురిపించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం భ‌ళ్ళాల‌దేవుడు రానా కెరీర్‌లో హిట్ చిత్రాలుగా నిలిచిన కృష్ణం వందే జ‌గద్గురు, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు జూన్ 29,2019న జ‌పాన్‌లోని స్కిప్ సిటీ కౌవాగుచ్చిలో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యాయ‌ట‌. జపాన్‌కి చెందిన ఓ వ్య‌క్తి ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్స్‌తో ఈ విష‌యాన్ని తెలిపాడు. రానా జ‌పాన్ అభిమాని పోస్ట్‌ని షేర్ చేస్తూ త‌న‌పై ఇంత ప్రేమ‌ని కురిపిస్తున్న జ‌పాన్ అభిమానుల‌కి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు రానా. ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల తెర‌కెక్కిస్తున్నాడు. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles