చంద్ర‌బాబులా మారిన రానా - మేకింగ్ వీడియో

Thu,February 21, 2019 07:36 AM
Rana Daggubati as Nara Chandrababu Naidu in making video

బాహుబ‌లి సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ పాపుల‌ర్ అయిన న‌టుడు రానా ప్ర‌స్తుతం ప‌లు భాష‌ల‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌ చేస్తున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన బ‌యోపిక్‌లో చంద్ర‌బాబు పాత్ర పోషించాడు. అయితే రానా ఈ సినిమా కోసం చంద్ర‌బాబులా ఎలా మారారు, ఎలాంటి మేక‌ప్ వేసుకున్నారు త‌దిత‌ర అంశాల‌ని మేకింగ్ వీడియోలో చూపించారు. ఈ వీడియో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌హానాయ‌కుడు చిత్రం ఎన్టీఆర్ రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కగా, ఇందులో చంద్ర‌బాబు పాత్ర కూడా చాలా కీల‌కంగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌హానాయ‌కుడు మూవీపై అభిమానుల‌లో భారీ ఆస‌క్తి పెరుగుతుంది. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా జోరుగా జ‌రుగుతున్నాయి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంతో రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మొద‌టి పార్ట్ సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

1761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles