నా ఆరోగ్యంపై త‌ప్పుడు ప్రచారం చేయ‌కండి : రానా

Sun,June 24, 2018 11:00 AM
RANA clarifies the rumors on him

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా ద‌గ్గుబాటి. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రానా త్వ‌ర‌లో త‌న కుడి క‌న్ను ఆప‌రేష‌న్ చేయించుకోనున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. బ్ల‌డ్ ప్రెష‌ర్ వ‌ల‌న స‌ర్జరీ కొంత ఆల‌స్య‌మైంది. అయితే ఆయ‌న కిడ్నీ సంబంధింత వ్యాధితో కూడా బాధ‌ప‌డుతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఇటీవ‌ల దీనిపై క్లారిటీ ఇచ్చాడు రానా .త‌న‌కు బ్ల‌డ్ ప్రెషర్ స‌మస్య ఉంద‌న్న రానా అందుకు సంబంధించి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న‌ట్టు చెప్పాడు. ఈ కార‌ణంగానే క‌న్ను ఆప‌రేష‌న్ లేట్ అయింద‌ని అన్నాడు. వీటికి మంచి త‌న‌కు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవంటూ పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చాడు రానా . అయితే రీసెంట్‌గా రానా తండ్రి సురేష్ బాబు ఇంట‌ర్వ్యూలో రానా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని , త్వ‌ర‌లోనే చికిత్స ప్రారంభం అవుతుంద‌ని చెప్ప‌డంతో రూమ‌ర్స్ మ‌రింత‌ స్ప్రెడ్ అయ్యాయి. దీనిపై రానా త‌న ట్విట్ట‌ర్ వేదికగా స్పందించాడు. నా ఆరోగ్యం గురించి కొన్నాళ్ళుగా ర‌కర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. నేను చాలా బాగున్నాను. కేవ‌లం బ్ల‌డ్ ప్రెష‌ర్ (బీపీ)కి సంబంధించిన స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నాను. కొద్ది రోజుల‌లో అంతా సెట్ అవుతుంది. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. కానీ పుకార్లు సృష్టించకండి ఇది నా ఆరోగ్యం మీది కాదు అని ట్వీట్ చేశాడు.2455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles