ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో జ‌య‌ల‌లిత బ‌యోపిక్

Wed,September 4, 2019 10:48 AM

1960 మ‌ధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల న‌టి జ‌య‌లలిత. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌,భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది పురుచ్చతలైవీ. భార‌త రాజ‌కీయాల‌లోను ముఖ్య భూమిక పోషించిన జ‌య‌ల‌లిత దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది. త‌మిళ తంబీలు అమ్మ‌గా పిలుచుకొనే జ‌య‌ల‌లిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆమెపై బ‌యోపిక్ రూపొందించేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేతి రెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ‘శశి లలిత’ పేరిట బ‌యోపిక్ చేస్తున్నాడు. అలానే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ .. త‌లైవీ అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తుండ‌గా, ఇందులో కంగనా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది.


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ జ‌య‌ల‌లిత జీవితంపై కల్పిత వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీనికి క్వీన్ అని పేరు పెట్టారు. MX ప్లేయర్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో రమ్య కృష్ణన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వర్ ఫుల్ పాత్ర‌ల‌లో అల‌రించిన ర‌మ్య‌కృష్ణ‌న్ .. జ‌య‌ల‌లిత‌గా కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తుంద‌ని అంటున్నాడు ద‌ర్శ‌కుడు. వెబ్ సిరీస్ ప్రీమియర్ తేదీని త్వరలో ప్రకటించాలని భావిస్తున్నారు మేక‌ర్స్.

1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles