20 ఏళ్ళ త‌ర్వాత అమితాబ్‌తో న‌టించ‌నున్న‌ రమ్యకృష్ణ‌..!

Wed,April 3, 2019 09:13 AM
Ramya Krishnan teams up with Amitabh Bachchan

బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉయర్నత మనిథన్. తమిళ్‌వానన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో న‌టుడు, ద‌ర్శ‌కుడు ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. త‌మిళం, హిందీ భాష‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ పైకి వెళ్లింది. చిత్ర ఫ‌స్ట్ లుక్ ర‌జ‌నీకాంత్ చేతుల మీదుగా విడుద‌లైంది. ఈ చిత్రంలో అమితాబ్ స‌ర‌స‌న రమ్య‌కృష్ణ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈమె పాత్ర కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పాత్ర‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో న‌టించడం అద‌న‌పు బ‌లం అని అంటున్నారు. 1998లో అమితాబ్‌, ర‌మ్య‌కృష్ణ బ‌డే మియా చోటే మియా అనే హిందీ చిత్రంలో క‌లిసి న‌టించారు. 20 ఏళ్ళ త‌ర్వాత కోలీవుడ్ చిత్రం కోసం వీరు క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్ర‌క‌ర‌ణ ముంబైలో జ‌రుగుతుండ‌గా, ఇప్ప‌టికే ర‌మ్య‌కృష్ణ‌ చిత్ర బృందంతో క‌లిసి షూటింగ్‌లో పాల్గొంటుంద‌ట‌. ఇటీవ‌ల ర‌మ్య‌కృష్ణ సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కి మంచి స్పంద‌న ల‌భించింది.

2404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles