ఇంటి స‌భ్యుల‌తో ఆటాడుకున్న ర‌మ్య‌కృష్ణ‌

Sun,September 1, 2019 07:06 AM

బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి ఓ మహిళ బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి సంచ‌ల‌నం సృష్టించింది. బిగ్ బాస్ షో అనేక భాష‌ల‌లో కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌సారం అవుతున్న‌ప్ప‌టికి మ‌హిళ హోస్ట్ చేయ‌డం అనేది జ‌ర‌గ‌లేదు. కాని నాగ్ త‌న ఫ్యామిలీ వేసిన ట్రిప్ కార‌ణంగా స్పెయిన్‌కి వెళ్ల‌డంతో ర‌మ్య‌కృష్ణ ఫ్రేమ‌లోకి వ‌చ్చింది. తొలిసారి బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ర‌మ్య‌కృష్ణ ప‌ర్వాలేద‌నిపించింది. తెలుగు అంత ఫ్లూయెంట్‌గా రాక‌పోవ‌డంతో కాస్త బెరుకుగా మాట్లాడుతున్న‌ట్టు అనిపించింది.


సీజ‌న్ 3 ఎపిసోడ్ 42లో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ .. అభిమానుల‌కి హాయ్ చెప్పింది. ఆ త‌ర్వాత మ‌న టీవీలో శుక్ర‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌ని చూపించింది. శుక్ర‌వారం ఎపిసోడ్‌లో రాహుల్‌, బాబా, వ‌రుణ్‌ క‌లిసి నాగార్జున గురించి సరికొత్తగా పాట‌ని ర‌చించారు. దీనిని రాహుల్ ఆల‌పించగా, మిగ‌తా వారంద‌రు డ్యాన్స్ చేశారు. ఈ ప‌ర్‌ఫార్మెన్స్‌కి నాగ్ కూడా ఫిదా అయ్యారు. ఇక వెంట‌నే ఇంటి స‌భ్యుల ముందు ప్ర‌త్య‌క్షం అయిన రమ్య‌ని చూసి హౌజ్‌మేట్స్ షాక్ అయ్యారు. అంత‌లోనే నాగార్జున కూడా స్పెయిన్ నుండి లైవ్‌లో వారితో ముచ్చ‌టించారు.

తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లానని.. అందుకే బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి కాకుండా స్పెయిన్ నుండి వీడియో ద్వారా మాట్లాడుతున్నాని నాగ్ పేర్కొన్నారు. వ‌చ్చేవారం మళ్ళీ మిమ్మ‌ల్ని క‌లుస్తాన‌ని నాగ్ అన్నారు. అయితే అడ‌గ‌గానే బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని ర‌మ్య ముందుకు వ‌చ్చినందుకు ఆమెకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. త‌న‌కి విషెస్ అందించిన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు నాగ్. ఇక నాగ్‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు హౌజ్‌మేట్స్

తొలిసారి బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్న ర‌మ్య‌కృష్ణ ఇంటి స‌భ్యుల‌తో స‌రదా గేమ్ ఆడించారు. ఇద్ద‌రు వ్య‌క్తుల‌ని ముందుకు పిలిచి ఎదుటి వారిలో వారికి న‌చ్చ‌నిది ఏది, న‌చ్చింది ఏది చెప్పాల‌ని అన్నారు. చ‌ప్ప‌ట్లు కొట్ట‌గానే న‌చ్చిన‌ది, మ‌ళ్లీ చప్ప‌ట్లు కొట్ట‌గానే న‌చ్చ‌నిది చెప్పాల‌ని ర‌మ్య తెలిపింది. దీంతో మొదటగా.. బాబా భాస్కర్‌, పునర్నవిలు గేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.వారిని తిక‌మ‌క పెడుతూ ఓ ఆటాడుకున్నారు ర‌మ్య‌కృష్ణ‌ ఆ త‌ర్వాత మహేష్‌-వితికా, అలీ-శ్రీముఖి, రవి-హిమజ, శివజ్యోతి-రాహుల్‌లను పిలిచి ఇదే మాదిరిగా ఆటపట్టించింది. ఇక వారందర్నీ హౌస్‌లో తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పమని ఇంటి సభ్యులను కోరింది.

సీక్రెట్ టాస్క్‌లో ర‌వి, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్ .. ఈ ముగ్గురు వితికాని టార్గెట్ చేయ‌డంతో ఆమెకి జ‌రిగిన అన్యాయానికి ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశం ఇచ్చింది రమ్య‌. ద‌మ్ముంటే అబ్బాయిల‌పై మీ పంతం చూపించాల‌ని, అమ్మాయిల‌పై కాద‌ని వారిపై ఫైర్ అయింది శివ‌గామి. ప్ర‌తీకారం తీర్చుకునే ప్ర‌క్రియ‌లో ముందుగా వ‌రుణ్ మొహంపై కోల్డ్ కాఫీ పోయించిన రమ్య‌కృష్ణ ఆ త‌ర్వాత రాహుల్ ష‌ర్ట్‌ని క‌ట్ చేయ‌మ‌ని చెప్పింది. ఇక ర‌వికృష్ణ బెడ్‌ని నీళ్ల‌తో త‌డ‌ప‌మ‌ని శివ‌జ్యోతిని ఆదేశించింది.

ఇక ఎప్పుడు బ‌ట్ట‌లు విప్పి సిక్స్ ప్యాక్స్ క‌నిపించేలా తిరిగే అలీకి చిన్న శిక్ష విధించింది శివ‌గామి. ఆయ‌న బాడీ చుట్టూ టిష్యూ పేప‌ర్‌ని చుట్ట‌మ‌ని పేర్కొంది. ఇక హౌజ్‌లో అల్లరి చేసే శ్రీముఖి మూతికి టేప్ అతికించ‌మ‌ని అలీని కోరింది. బాబా భాస్క‌ర్ తప్ప మ‌రో వ్య‌క్తి క‌నిపించని మ‌హేష్‌కి బాబా ఫోటోల‌తో ఉన్న క‌ళ్ల అద్దాలు పెట్ట‌కోమ‌ని చెప్పారు ర‌మ్య‌. ఇక హిమ‌జ‌.. రాహుల్‌ని తిట్ట‌మ‌న‌గా ఆమె బూతులు గుర్తు తెచ్చుకొని మ‌రి తిట్టింది. మొత్తానికి శ‌నివారం ఎపిసోడ్ కాస్త స‌ర‌దాగానే సాగింది. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు ఎవ‌రు ఇంట్లో ఉంటార‌నేది తెలియ‌నుంది.


2960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles