కేజీఎఫ్ సీక్వెల్‌లో సంజ‌య్ ద‌త్‌, ర‌మ్య‌కృష్ణ‌ ..!

Fri,January 11, 2019 10:47 AM

క‌న్నడ చిత్రపరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా గుర్తింపు పొందిన చిత్రం ‘కేజీఎఫ్‌’ . గత డిసెంబరు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. భారీ వ‌సూళ్ల‌ను రాబట్టింది. కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించగా, దీన్ని 2400 థియేటర్లలో విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. ఒక్క హిందీలోనే ఈ చిత్రం ఏకంగా రూ.40 కోట్ల మేరకు వసూలు సాధించింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యువ నటుడు యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు.


నిర్మాత విజ‌య్ కిరంగ‌న్ దుర్ కేజీఆఫ్ చిత్రానికి సంబంధించి సీక్వెల్ చేయాల‌ని భావించ‌గా, ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా మొద‌లు పెట్టేశారు. ప్ర‌స్తుతం చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన నటీన‌టుల కోసం ప‌లువురి పేర్ల‌ని ప‌రిశీలిస్తున్నారు. అయితే ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఇక మొదటిభాగంలో చేసిన రవిశంకర్ .. అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. కాకపోతే అత‌ని పాత్ర‌ని మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా రూపొందించ‌నున్నార‌ట‌. దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. చూడాలి మ‌రి సీక్వెల్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో.

2906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles