చిక్కుల్లో ర‌మ్య‌కృష్ణ క్వీన్ చిత్రం..!

Fri,September 13, 2019 10:19 AM

దివంగ‌త న‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీనన్ బ‌యోపిక్‌ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడు. ఇటీవ‌ల చిత్ర ప్రీ లుక్ కూడా విడుద‌ల చేశాడు. ఈ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఆప‌క‌పోతే కోర్టులో కేసు వేస్తాన‌ని హెచ్చ‌రిస్తున్నారు జ‌య‌ల‌లిత మేన‌ల్లుడు దీపక్. జ‌య‌ల‌లిత గురించి ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌మీనన్ కి ఏం తెలుస‌ని బ‌యోపిక్ రూపొందిస్తున్నాడు. త‌క్ష‌ణమే వెబ్ సిరీస్‌ని ఆపాల్సిందిగా హెచ్చ‌రిస్తున్నాను అంటూ ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రి దీనిపై గౌత‌మ్ మీన‌న్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని దర్శకుడు విజయ్‌ తలైవీ పేరుతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ అమ్మగా నటించనుంది. అదే విధంగా దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్‌ లేడీ’ పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటించనుంది.

1696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles