శృంగార తార పాత్రకి న‌దియా నై.. ర‌మ్య‌కృష్ణ సై!

Tue,January 22, 2019 11:08 AM

ఏ పాత్ర‌లోనైన ఇట్టే ఒదిగిపోయే నటి ర‌మ్య‌కృష్ణ‌. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన రమ్య‌కృష్ణ ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ రోల్స్‌తో అల‌రిస్తుంది. బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పాత్ర‌తో త‌నేంటో ప్ర‌పంచానికి చాటి చెప్పింది. రీసెంట్‌గా శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రంలో చైతూ అత్త‌గా స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. అయితే సూప‌ర్ డీల‌క్స్ అనే త‌మిళ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ శంగార తార‌గా క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ముందుగా ఈ పాత్ర కోసం న‌దియాని సంప్ర‌దించ‌గా, ఆమె నో చెప్ప‌డంతో ర‌మ్య‌కృష్ణ‌ని సంప్ర‌దించార‌ట‌. విజ‌య్ సేతుప‌తి, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్యాగ‌రాజ‌న్ కుమార రాజా తెర‌కెక్కిస్తున్న చిత్రం సూప‌ర్ డీల‌క్స్. ఇందులో విజయ్‌ సేతుపతి లింగమార్పిడి చేయించుకున్న మహిళ పాత్రలో, సమంత హంతకురాలి పాత్రలో నటిస్తున్నారు. వీరి పాత్ర‌ల‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్ కూడా విడుద‌లయ్యాయి. తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న‌ ఈ సినిమాకు పీసీ శ్రీరాం, పీఎస్‌ వినోద్‌, నీరవ్‌ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

5394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles