జ‌య‌ల‌లిత‌గా ర‌మ్య‌కృష్ణ‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tue,December 3, 2019 08:48 AM

దివంగ‌త న‌టి , మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో ప‌లు బ‌యోపిక్స్‌తో పాటు వెబ్ సిరీస్‌లు రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో తలైవీ పేరుతో బ‌యోపిక్ రూపొందుతుండగా, ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో జ‌య‌ల‌లిత‌గా కంగ‌నా ఆక‌ట్టుకుంది. ఇక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ జ‌య‌లలిత జీవిత నేప‌థ్యంలో వెబ్ సిరీస్ చేస్తుండ‌గా, ఇందులో ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో జ‌య‌ల‌లిత బాల్యాన్ని చూపిస్తూ, ట్రైల‌ర్‌ని డిసెంబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌య‌ల‌లిత పాత్ర పోషిస్తున్న ర‌మ్య‌కృష్ణ ఫేస్ రివీల్ చేయ‌లేదు మేక‌ర్స్‌. తాజాగా జ‌య‌లలిత పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇందులో ర‌మ్య లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. క్వీన్ అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ రూపొందుతుండ‌గా, MX ప్లేయర్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. తెలుగు, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ వెబ్ సిరీస్‌ని మ‌నం వీక్షించ‌వ‌చ్చు.8777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles