‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మాత్రమే ఆపుతున్నారంటే..?

Mon,April 29, 2019 03:14 PM

ఏపీ పోలీస్ యంత్రాంగం ఆదివారం తమను బలవంతంగా తీసుకువచ్చి..విజయవాడ ఎయిర్‌పోర్టులో 7 గంటలు నిర్బంధించారని సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వర్మ మాట్లాడుతూ..పోలీసులు, అధికారులు ఎవరి వల్ల అలా ప్రవర్తిస్తున్నారో తనకు తెలియదన్నారు. నా ముందు కనిపించే అధికారులు మాకు పైనుంచి ఆదేశాలున్నాయన్నారు. పై నుంచి అధికారాలు దేవుడిచ్చాడా..? ప్రభుత్వం ఇచ్చిందా? వ్యక్తులు ఇచ్చారా..? అని వర్మ ప్రశ్నించారు.


లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ఆపడానికి ఎవరికి అసరముంటుంది. ఎపుడు ఏ సినిమాను ఆపకుండా..కేవలం ఒక్క లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఆపుతున్నారంటే..ఎవరైనా దాని వల్ల నష్టం జరిగే మనుషులున్నారా అనేది అనుమానం రాకుండా ఎలా ఉంటుందని వర్మ అన్నారు. మిమ్మల్ని ఈ కారణం వల్ల ఇక్కడకు రానివ్వడం లేదు..మిమ్మల్ని నిర్బంధిస్తున్నాం అని చెప్పినపుడు మనం ఆలోచిస్తాం. ఇది ఒక్కరిద్దరు అధికారులు చేసింది కాదు. 100 మంది ఆఫీసర్లకుపైగా ఇన్వాల్వ్‌ అయి ఉన్నపుడు, ఇది పైస్థాయి నుంచి రాకపోతే అంత ప్రభావం ఉండదని వర్మ అన్నారు.

రామ్‌గోపాల్‌ వర్మ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. విజయవాడలో ప్రెస్‌ మీట్‌ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బంట్రోతులు కన్నా హీనంగా వాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు.

2343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles