నితిన్ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

Thu,March 21, 2019 01:12 PM

యంగ్ హీరో నితిన్ కొన్నాళ్ళుగా సైలెంట్‌గా ఉన్నాడు. ఆయ‌న సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌డంతో అభిమానులు డిప్రెష‌న్ లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ద్వారా నెలాఖరుకి ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇస్తాన‌ని అన్నాడు. అన్న‌ట్టుగానే హోలీని పుర‌స్క‌రించుకొని త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ వివ‌రాలు వెల్ల‌డించాడు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుండగా, ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఆగ‌స్ట్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం ‘ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాల సరసన చేరుతుందని నితిన్ భావిస్తున్నాడు. మ‌రో వైపు నితిన్‌ ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంతో పాటు త‌మిళ సూప‌ర్ హిట్ రీమేక్‌లో న‌టించేందుకు కూడా సిద్ధ‌మ‌య్యాడు . ర‌ట్సాస‌న్ అనే త‌మిళ చిత్రం ఈ ఏడాది ఇండియాలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రాల‌లో రెండ‌వ స్థానంలో నిలిచింది. ఇప్ప‌టికే ఈ చిత్ర రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్న నితిన్ త్వ‌ర‌లోనే ఈ మూవీని రీమేక్ చేయ‌నున్న‌ట్టుగా తెలుస్తుంది.

1658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles