రీ ఎంట్రీకి స్టార్‌ హీరోయిన్ ప్లాన్..

Wed,March 21, 2018 06:33 PM
Rambha plans to silver screen reentry


హైదరాబాద్ : తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బోజ్‌పురి భాషల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది నటి రంభ. ఇండస్ట్రీలో అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ స్టార్ హీరోయిన్ సిల్వర్ స్క్రీన్‌కు దూరమైన దశాబ్దానికిపైనే అవుతుంది. వైవాహిక జీవితంతో బిజీ అయి ప్రస్తుతం విదేశాల్లో సెటిల్ అయింది. ఇక రంభ ఆ మధ్య ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జిగా కూడా వ్యవహరించింది. తాజాగా సిల్వర్‌స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంభ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రంభ తన కోస్టార్స్ లాగా తల్లి పాత్రలోనే, సిస్టర్ పాత్రలోనో కనిపించకుండా డిఫరెంట్ రోల్‌లో కనిపించాలని భావిస్తోందట. సప్తగిరి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో రంభ లీడ్ రోల్ లో నటిస్లున్నట్లు సమాచారం. కోలీవుడ్ లో బిగ్‌స్క్రీన్‌పై కనిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందట రంభ. సెకండ్ ఇన్నింగ్స్‌తో మరిన్ని హిట్స్ కొట్టాలని మనమూ విష్ చేద్దాం.

3543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS