వైర‌ల్‌గా మారిన రంభ ఫ్యామిలీ పిక్స్‌

Sun,November 11, 2018 07:10 AM
rambha family pics goes viral

తెలుగులోనే కాక ప‌లు భాష‌ల‌లోను టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో న‌టించిన రంభ పెళ్లి త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కి దూర‌మైంది. అయితే 2016 లో తన భర్త నుండి విడాకులు కావాలని కోరిన రంభ మ‌ళ్ళీ అత‌నితో క‌లిసి జీవించాల‌ని నిర్ణ‌యించుకోగా, ప్ర‌స్తుతం వీరిద్ద‌రు అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే రంభ సెప్టెంబ‌ర్ 23న పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు ‘శివిన్‌’ అని నామకరణం చేశారు. రంభ రీసెంట్‌గా ఆ బాబుతో పాటు ఫ్యామిలీతో అంద‌రితో క‌లిసి ఫోటోలు దిగింది. అవి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. పంచ‌దార బ్యాగ్ క‌న్నా వీడు చిన్న‌గా ఉన్నాడు. పసిపిల్ల‌ల‌ని ఎత్తుకుంటే ఎంత స్పూర్తిదాయకంగా ఉంటుందో. వేసవిలో కాచే స్ట్రాబెర్రీలా మా అబ్బాయి నవ్వు ఎంత తీయగా ఉందో.. నేను ఊహించినదానికంటే తన కళ్లు ఎంత మెరుస్తున్నాయో అంటూ రంభ త‌న కుమారుడిని చూస్తూ మురిసింది. రంభ‌కి ప్ర‌స్తుతం లాన్య(7), శాషా(3) అనే ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. ప్ర‌ముఖ అగ్ర‌హీరోలంద‌రితో న‌టించిన రంభ పెళ్లి త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కి దూర‌మైంది. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోస్‌తో బిజీగా ఉంది రంభ .


6093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles