వ‌రుస రీమేక్‌లని లైన్‌లో పెడుతున్న ఇస్మార్ట్ శంక‌ర్

Wed,October 16, 2019 09:16 AM

ఎనర్జిటిక్ హీరో రామి పోతినేనికి ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం ఎంత పెద్ద విజ‌యం అందించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రామ్ వ‌రుస సినిమాల‌ని లైన్‌లో పెడుతున్నాడు. ప్ర‌స్తుతం త‌డ‌మ్ అనే త‌మిళ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దం కాగా, ఈ చిత్రంతో పాటు మ‌ల‌యాళ మూవీని రీమేక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట రామ్. అనురాజ్ మ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇష్క్ అనే మ‌ల‌యాళ చిత్రం తెర‌కెక్క‌గా, ఈ చిత్రం ల‌వ్ థ్రిల్ల‌ర్‌గా మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ క్ర‌మంలో ఇష్క్ మూవీని స్రవంతి ఆర్ట్స్ బ్యాన‌ర్‌, ఈ ఫోర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ క‌ల‌యిక‌లో రూపొందించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

1726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles