రామ్ కొత్త చిత్రం ప్రారంభం

Thu,April 26, 2018 01:35 PM
ram pothineni new movie launched

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ రీసెంట్‌గా ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావ్ నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో 'హలో గురు ప్రేమ‌ కోసమే’ టైటిల్‌తో చిత్రం చేస్తున్నాడు. ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమాని లాంచ్ చేశాడు హీరో రామ్‌. గ‌రుడ వేగ చిత్రంతో మంచి హిట్ కొట్టిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో త‌న 17వ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాలని మించేలా ఉంటుంద‌ని అంటున్నారు. మే 7నుండి జార్జియాలో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ మూవీ నెలాఖ‌రు వ‌ర‌కు ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఆ త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌, ఫ్రాన్స్, ఇట‌లీలోని సుంద‌రమైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌పుకోనుంది. విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక కాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారట‌. న్యూ వేవ్ లో సాగే ఈ చిత్రంలో యాక్ష‌న్, అడ్వంచ‌ర‌స్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయని ద‌ర్శ‌కుడు తెలిపారు. చిత్రంలో కాజ‌ల్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు స‌మ‌చారం. గ‌తంలో రామ్‌, కాజ‌ల్ క‌లిసి గ‌ణేష్( 2009) అనే చిత్రంలో క‌లిసి న‌టించారు. స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మాణంలో ఈ మూవీ రూపొంద‌నుంది.


2183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles