భారీ కండ‌లు పెంచిన ఇస్మార్ట్ హీరో

Thu,March 14, 2019 09:06 AM
Ram Pothineni looks too strong

యువ హీరో రామ్ పోతినేనికి ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ లేదు. ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా త‌న‌కి మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని స్ట్రాంగ్‌గా న‌మ్ముతున్నాడు రామ్‌. అయితే సినిమా కోసం రామ్ భారీ కండ‌లు పెంచే పనిలో ఉన్నాడు. జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న ఫోటోల‌ని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ 2.0 లోడింగ్ అని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోల‌లో రామ్‌ని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ చిత్రీక‌ర‌ణ గోవాలో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా చిత్ర నిర్మాత చార్మి హార్డ్ వ‌ర్క్‌తో పాటు పార్టీ కూడా జ‌రుపుకున్నాం అని ఇస్మార్ట్ శంకర్ టీం ఫోటోని షేర్ చేస్తూ ఈ విష‌యాన్ని తెలిపింది. దీనిని రీ ట్వీట్ చేసిన పూరీ వ‌ర్క్‌.. ఫ్రెండ్స్‌.. మ్యూజిక్‌.. బీచ్ అనే కామెంట్ పెట్టాడు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరో స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.




2722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles