తొలిసారి డబుల్ రోల్‌.. రీమేక్‌ని న‌మ్ముకున్న రామ్

Sat,October 19, 2019 09:55 AM

ఎనర్జిటిక్ హీరో రామ్‌కి ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం ఎంత పెద్ద విజ‌యాన్ని అందించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం అందించిన విజ‌యం రామ్‌లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. అదే ఉత్సాహంతో త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్రవంతి బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్నాడు. 'థాడమ్' అనే తమిళ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా నిర్మితం కానుంది. తమిళంలో మగిల్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు రామ్ కూడా తెలుగు రీమేక్‌లో డ‌బుల్ రోల్ పోషించ‌నుండ‌గా, తొలి సారి రెండు పాత్ర‌లు పోషిస్తున్న రామ్ ఎలా అల‌రిస్తాడో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్‌కి జోడీగా నివేదా పేతురేజ్ .. మాళవిక శర్మ న‌టించ‌నున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

1600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles