అభిరామ్ ని ప‌రిచ‌యం చేసిన రామ్

Sat,August 19, 2017 04:30 PM
ram introduces abhiram look

నేను శైల‌జ వంటి సూప‌ర్ హిట్ చిత్రం త‌ర్వాత రామ్ పోతినేని చేస్తున్న చిత్రం ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రామ్ త‌న 15వ చిత్రంగా చేస్తున్న ఈ చిత్రం స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ పై నిర్మిత‌మ‌వుతుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ స్టైలిష్ లుక్ తో క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ఊటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంద‌ని తెలుస్తుండగా, రామ్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ లో స్టైలిష్ లుక్ ని పోస్ట్ చేశాడు. అభిరామ్ అనే క్యారెక్టర్ తో మీముందుకు వ‌చ్చేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చేస్తున్నాను అంటూ ఓ స్టైలిష్ ఫోటోని పోస్ట్ చేశాడు. ఇది ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. ఈ చిత్రానికి సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించనుండగా, సినిమాటోగ్ర‌ఫీ స‌మీర్ రెడ్డి , ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు.


1779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles