పూరీకి స‌రికొత్త టైటిల్ సూచించిన వ‌ర్మ‌

Fri,July 19, 2019 08:44 AM
ram gopal varma suggests new title for sequel

శివ సినిమాతో తెలుగు సినిమా స్టైల్‌నే మార్చేసిన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న శిష్యుడిగా పూరీ జ‌గ‌న్నాథ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ రీసెంట్‌గా రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఇస్మార్ట్ శంక‌ర్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. వ‌ర్మ కూడా త‌న శిష్యుడిని అభినందిస్తూ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలని సూచించాడు. ఈ మేరకు వర్మ పూరి జగన్నాధ్ కు టైటిల్ కూడా సూచించాడు. 'ట్రిపుల్ ధిమాఖ్' పేరుతో సీక్వెల్ తెరక్కించాలని వర్మ ట్వీట్ చేశాడు.

వ‌ర్మ ట్వీట్‌కి స‌మాధానంగా పూరీ తాను ఆల్రెడీ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్ర సీక్వెల్‌కి టైటిల్ ఫిక్స్ అయ్యాన‌ని.. 'డబుల్ ఇస్మార్ట్' పేరుతో ఈ చిత్రం ఉండబోతోందని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ టైటిల్‌ని రిజిస్టర్ చేయించా అని కూడా తెలిపాడు. మ‌రి సీక్వెల్‌లోను రామ్‌ని హీరోగా ఎంచుకుంటాడా లేదంటే కొత్త హీరోతో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. పూరీ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో రామ్ స‌ర‌స‌న నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు

3081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles