వ‌ర్మ స్టైల్‌లో సంజయ్ ద‌త్ బ‌యోపిక్..!

Fri,July 20, 2018 12:50 PM
RAM GOPAL VARMA PROMISES TO MAKE SANJAY DUTT biopic

బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ జీవిత నేప‌థ్యంలో సంజూ అనే బ‌యోపిక్ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అతి పెద్ద విజ‌యం సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 500 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టిన ఈ చిత్రం ఇప్ప‌టికి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌నే రాబ‌డుతుందని అంటున్నారు. సంజూ చిత్రంకి ఎన్ని ప్ర‌శంస‌లు ల‌భించాయో, అన్ని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. చిత్రంలో సంజ‌య్‌ని గొప్ప‌గా చూపించేందుకే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని కొంద‌రు కామెంట్స్ చేశారు. క‌ట్ చేస్తే ఇప్పుడు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్‌ వర్మ సంజు : ది రియల్‌ స్టోరీ పేరుతో సంజయ్‌ దత్‌ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్టు సమాచారం.

రీసెంట్‌గా ముంబై మిర్ర‌ర్ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను సంజ‌య్ ద‌త్ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌లని యధాత‌దంగా చూపిస్తాన‌ని అన్నారు వ‌ర్మ‌. హిరాణీ తెర‌కెక్కించిన‌ సంజు చిత్రం న‌చ్చింది. కానీ ఆయ‌న త‌న జీవితంలో రెండు ద‌శాబ్ధాలుగా ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య గురించి నా సినిమాలో చూపించ‌నున్నాను అని తెలిపాడు ఆర్జీవి. అంటే ముంబై పేలుళ్ల కేసులో సంజయ్‌ వద్దకు ఏకే- 56 రైఫిల్‌ ఎలా వచ్చింది.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి త‌న‌ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్టు వ‌ర్మ చిన్న హింట్ ఇచ్చారు. వివ‌రాల కోసం సంజ‌య్ సన్నిహితుల‌ని, పోలీసు శాఖ వారిని కూడా సంప్ర‌దిస్తానంటూ రామ్ గోపాల్ వ‌ర్మ పేర్కొన్నారు.

1245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS