సీసీఎస్ విచార‌ణకి హాజ‌రు కాని వ‌ర్మ ..!

Fri,February 23, 2018 10:27 AM
Ram Gopal Varma  not attended to ccs

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ జీఎస్టీ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌) వెబ్ సిరీస్‌ వివాదంతో పాటు చ‌ర్చ‌ల‌లో మహిళ‌ల‌ని అగౌర‌వ‌ప‌రుస్తూ కొన్నివివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నేప‌ధ్యంలో ఆయ‌న‌పై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. గ‌త నెల 25న సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ముంబైలో ఉన్న వ‌ర్మ‌కి నోటీసులు పంపారు. అయితే షూటింగ్ బిజీలో ఉన్న‌ తాను విచార‌ణ‌కి హాజ‌రు కాలేన‌ని చెప్పారు. రీసెంట్‌గా మ‌రోసారి వ‌ర్మ‌కి నోటీసులు పంపగా, ఫిబ్ర‌వ‌రి 17న సీసీఎస్ స్టేషన్‌లో విచారణకు హాజ‌ర‌య్యారు. ప‌లు అంశాల‌పై వ‌ర్మ‌ని విచారించిన పోలీసులు రామ్‌గోపాల్ వర్మ ల్యాప్‌టాప్ సీజ్ చేశారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ మ‌రికొంత స‌మ‌యం కావాలని కోరారు . ఈ నేప‌థ్యంలో వ‌ర్మ నేడు సీసీఎస్ విచార‌ణ‌కి హాజ‌రు కావ‌ల‌సి ఉంది . కాని వ‌ర్మ ఈ రోజు విచార‌ణ‌కి హాజ‌రు కాక‌పోగా, త‌న‌కి మ‌రి కొన్నిరోజుల సమ‌యం కావాల‌ని కోరిన‌ట్టు తెలుస్తుంది . ప్ర‌స్తుతం నాగార్జున ప్ర‌ధాన‌పాత్ర‌లో తెర‌కెక్కుతున్న‌ కాప్ డ్రామా మూవీతో బిజీగా ఉన్నాడు వ‌ర్మ . మార్చి వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసి స‌మ్మ‌ర్‌లో మూవీని రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నాడు. వ‌ర్మ కంపెనీ బేన‌ర్‌లోనే ఈ మూవీ రూపొందుతుంది.

889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS