పాక్ ప్ర‌ధానిని నిల‌దీసిన‌ వ‌ర్మ‌

Thu,February 21, 2019 10:31 AM
ram gopal varma fire on imran khan

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కి వ‌రుస ట్వీట్స్ చేశారు. పుల్వామా దాడిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్.. మాట‌ల‌తో అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని చెప్ప‌గా, దానికి ట్వీట్ల‌తో కౌంట‌ర్ ఇచ్చాడు వ‌ర్మ‌. ఆయ‌న చేసిన ఇంగ్లీష్ ట్వీట్స్‌ని ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన‌వెంక‌ట్ తెలుగులోకి అనువ‌దించి రీట్వీట్ చేయ‌డం విశేషం.

ప్రియ‌మైన ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మీరు మాట‌ల‌తో అన్ని స‌మస్య‌లు ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని న‌మ్మిన‌ప్పుడు మూడు వివాహాలు ఎందుకు చేసుకోవ‌ల‌సి వ‌చ్చిందో అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. ట‌న్నుల కొద్ది ఉన్న ఆర్డీఎక్స్‌తో ఓ వ్య‌క్తి మా వైపుకి దూసుకొస్తున్న‌ప్ప‌డు అత‌నితో ఎలా చ‌ర్చ‌లు జ‌ర‌పాలో మా మూగ భార‌తీయులకి చెప్పండి. మీరు ఊరికే ఏమి చెప్ప‌వ‌ద్దు. భార‌తీయులందరం మీకు, మీ ట్యూష‌న్ టీచ‌ర్‌కి ఫీజు చెల్లిస్తాము. మీ దేశంలో ఎవ‌రు ( ఒసామా బిన్ లాడెన్‌) నివ‌సిస్తున్నార‌నేది అమెరికాకి తెలుసు. కాని మీ దేశంలో ఎవ‌రు ఉంటున్నార‌నేది మీకు తెలియ‌దు. అసలు మీది ఒక దేశ‌మేనా ? ఏదో మూగ భార‌తీయుడిని అడుగుతున్నాను స‌ర్‌.. నాకు కొద్దిగా జ్ఞానం పంచండి ఇమ్రాన్ స‌ర్‌.

ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు, కానీ మీరు ఆ సంస్థ‌ల‌పై ప్రేమ చూపించ‌డం లేద‌నే విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదాలను మీరు బంతులుగా భావిస్తున్నార‌ని నేను విన్నారు. ఆ బంతుల‌ని పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి కొడుతున్నారు. సార్ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబులు అనుకుంటున్నారో కాస్త చెప్పాలి. ద‌యచేసి మీరు మ‌మ్ముల‌ని కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి స‌ర్ అని ప‌లు ట్వీట్ల‌తో ఇమ్రాన్ ఖాన్‌పై సెటైర్స్ వేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్స్‌పై ఆసక్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.


2172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles