దావూద్‌ ఇబ్ర‌హీంపై వ‌ర్మ తాజా ప్రాజెక్ట్‌

Thu,July 26, 2018 12:36 PM
ram gopal varma d company web series starts soon

ప్రేమ క‌థా చిత్రాలు లేదా స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ మూవీస్ రూపొందించడంలో రామ్ గోపాల్ వ‌ర్మ దిట్ట అనే సంగ‌తి తెలిసిందే. శివ‌, స‌త్య‌, ర‌క్త చ‌రిత్ర వంటి చిత్రాల‌తో త‌నేంటో ప్రూవ్ చేసుకున్న రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం డీ కంపెనీ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడ‌ట‌. వెబ్ సిరీస్‌గా ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ రానుంది. ఇందులో ముంబయి అండర్‌వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం 1980ల్లో సృష్టించిన అల్లర్లు, అతను స్థాపించిన ‘డి-కంపెనీ’ గురించి ఇందులో ప్రస్తావించబోతున్నాం అని వ‌ర్మ అన్నారు. ఐదు సీజ‌న్స్‌లో ప‌ది ఎపిసోడ్‌లుగా ఈ వెబ్ సిరీస్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు వ‌ర్మ‌. గ‌త 20 ఏళ్ళ నుండి గ్యాంగ్‌స్ట‌ర్స్ మ‌రియు అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్స్ వారి మధ్య‌వ‌ర్తుల నుండి సేక‌రించిన డాటాని బ‌ట్టి డీ కంపెనీని రూపొందిస్తున్నాం . ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ వెబ్ సిరీస్‌ని తెర‌కెక్కించనున్న‌ట్టు వ‌ర్మ స్ప‌ష్టం చేశారు.

డీ కంపెనీ అనే వెబ్ సిరీస్ దావూద్ ఎదుగుద‌ల‌, త‌క్కువ టైంలో ప‌ఠాన్ గ్యాంగ్‌ని ప‌డ‌గొట్ట‌డం, ఆ త‌ర్వాత దుబాయ్ కి వెళ్లి చ‌ల‌న చిత్ర న‌టుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌తో సంబంధాలు పెట్టుకోవ‌డం తదిత‌ర విష‌యాలు డీ కంపెనీ సిరీస్‌లో చూపించ‌బోతున్నాం. అంతే కాదు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా కంపెనీ టెర్ర‌ర్ కంపెనీగా ఎలా మారింద‌నే విష‌యం కూడా ఇందులో ప్ర‌స్తావించ‌నున్నాం అని వ‌ర్మ చెప్పుకొచ్చారు . 1993లో బాబ్రీ మ‌సీద్ కూల్చివేత ఘోరమైన ఘర్షణలను ప్రేరేపించింది .బాంబు పేలుళ్లకు కూడా దారితీసింది . చివరకు దావూద్ పై యుద్ధం ప్రకటించటానికి ఆయన నుండి విడిపోయారు చోటా రాజన్ . ఆ సంఘ‌ట‌న‌లన్ని ఈ సిరీస్‌లో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చివ‌రిగా ఆఫీస‌ర్ అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చిన వ‌ర్మ ఎబోలా కంటే భయంకరమైన వైరస్‌ నేపథ్యంలో వైర‌స్ అనే చిత్రాన్ని కూడా తెర‌కెక్కించ‌నున్నాడు.1377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles