సామాజిక కార్యకర్త దేవికి వర్మ క్షమాపణలు

Sat,February 17, 2018 06:33 PM
సామాజిక కార్యకర్త దేవికి వర్మ క్షమాపణలు

హైద‌రాబాద్‌: జీఎస్టీ సినిమాపై టీవీ చర్చలో భాగంగా సామాజిక కార్యకర్త దేవిపై చేసిన వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. ఇవాళ ఆయన జీఎస్టీపై నమోదయిన కేసులపై సీసీఎస్ స్టేషన్‌లో విచారణకు హాజరయిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం జరిగిన టీవీ చర్చలో పాల్గొన్న వర్మ.. దేవిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. తనను కావాలని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. నిజంగా తన వ్యాఖ్యలకు ఆమె మనోభావాలు దెబ్బతింటే సారీ అని వర్మ చెప్పారు. చర్చలో భాగంగా అలా మాట్లాడానే తప్ప ఆమెను కావాలని అన్న మాటలు కావని వర్మ తెలిపారు.

ఇక.. జీఎస్టీపై నమోదయిన కేసుల విచారణలో భాగంగా వర్మను సీసీఎస్ స్టేషన్‌లో దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు విచారించారు. వర్మను విచారించిన అనంతరం.. సీసీఎస్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాతో మాట్లాడారు.

"రామ్‌గోపాల్ వర్మ ల్యాప్‌టాప్ సీజ్ చేశాం. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించాం. పోలాండ్, యూకేలో జీఎస్టీ చిత్రీకరణ జరిగిందని వర్మ తెలిపారు. ఆయన పోలాండ్, యూకే వెళ్లడంపై విచారణ చేస్తున్నాం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ సమయం కోరారు. వచ్చే శుక్రవారం మళ్లీ విచారణకు రావాలని వర్మకు చెప్పాం. సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదుపైనా వర్మను ప్రశ్నించాం. టీవీ చర్చలో భాగంగానే మహిళపై వ్యాఖ్యలు చేశానని వర్మ సమాధానమిచ్చారు. జీఎస్టీ సినిమాను తాను తీయలేదని వర్మ తెలిపారు. జీఎస్టీ సినిమా కథ(కాన్సెప్ట్‌) మాత్రమే తనదని వర్మ పేర్కొన్నారు..." అని రఘువీర్ తెలిపారు.

2764

More News

VIRAL NEWS