ఒకేసారి రెండు సినిమాలు చేయాలనుకుంటున్న కుర్ర హీరో

Sun,April 29, 2018 12:01 PM
ram did two movies simultaneously

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ చివ‌ర‌గా ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావ్ నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో 'హలో గురు ప్రేమ‌ కోసమే’ టైటిల్‌తో చిత్రం చేస్తున్నాడు. ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమాని లాంచ్ చేశాడు హీరో రామ్‌. గ‌రుడ వేగ చిత్రంతో మంచి హిట్ కొట్టిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో త‌న 17వ సినిమా చేయ‌నున్నాడు

రామ్ 17వ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాలని మించేలా ఉంటుంద‌ని తెలుస్తుంది మే 7నుండి జార్జియాలో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ మూవీ నెలాఖ‌రు వ‌ర‌కు ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఆ త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌, ఫ్రాన్స్, ఇట‌లీలోని సుంద‌రమైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌పుకోనుంది. విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక కాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారట‌. అయితే ఈ చిత్రంతో పాటు హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్ర షూటింగ్స్‌లో రామ్ సైమ‌ల్‌టేనియ‌స్‌గా పాల్గొంటాడ‌ట‌. రామ్ - ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రం న్యూ వేవ్ లో సాగే చిత్రంగా ఉంటుంద‌ని ఇందులో యాక్ష‌న్, అడ్వంచ‌ర‌స్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయని ద‌ర్శ‌కుడు తెలిపారు. చిత్రంలో కాజ‌ల్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు స‌మ‌చారం. గ‌తంలో రామ్‌, కాజ‌ల్ క‌లిసి గ‌ణేష్( 2009) అనే చిత్రంలో క‌లిసి న‌టించారు. స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మాణంలో ఈ మూవీ రూపొంద‌నుంది.

2269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS