సానియా త‌న‌యుడితో లండ‌న్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఉపాస‌న‌

Tue,June 25, 2019 12:07 PM
ram charan wife enjoyed with izhaan

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న ఇటీవ‌ల జ‌రిగిన ఇండియా - పాక్ మ్యాచ్ వీక్షించేందుకు లండ‌న్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు మ్యాచ్‌లో ఉపాస‌న‌తో పాటు త‌న ఫ్రెండ్స్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, మంచు ల‌క్ష్మీ, క‌నికా క‌పూర్‌ల‌తో క‌లిసి మాంచెస్ట‌ర్ గ్రౌండ్‌లో సంద‌డి చేశారు. స్టేడియంలో తొలిసారి మ్యాచ్ చూసాను అని గ్రౌండ్‌లో దిగిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ఉపాస‌న . అయితే ఇప్ప‌టికి లండ‌న్‌లోనే ఉన్న ఉపాస‌న రీసెంట్‌గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కొడుకు ఇజాన్‌తో సరదాగా గడిపారు. ఇజాన్‌తో క‌లిసి లండ‌న్ వీధుల్లో స‌ర‌దాగా తిరిగారు. వాటికి సంబంధించిన ఫోటోల‌ని ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా షేర్ చేసింది. సానియా భ‌ర్త షోయ‌బ్ మాలిక్ ప్ర‌స్తుతం వ‌ర‌ల్ట్ క‌ప్ మ్యాచ్‌ల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌నతో సానియా కూడా కొద్ది రోజులుగా ఇంగ్లండ్‌లోనే ఉంటుంది. అయితే సానియాతో ఉపాస‌న‌కి మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న నేప‌థ్యంలో వీరిద్ద‌రు క‌లిసారు.2525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles