ఘ‌నంగా జ‌రిగిన వెంకీ కూతురి వివాహం

Sun,March 24, 2019 10:26 AM
ram charan, upasana at venky daughter pre wedding celebrations

ద‌గ్గుబాటి ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. విక్ట‌రీ వెంక‌టేష్ కూతురు ఆశ్రిత ..హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిల వివాహం ఆదివారం తెల్ల‌వారుఝామున‌ జైపూర్‌లో ఘనంగా జరిగింది. రెండు రోజుల నుండే పెళ్లి వేడుకలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ద‌గ్గుబాటి ఫ్యామిలీ నిన్న ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల‌ని ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్ ఖాన్, చైతూ, స‌మంతో పాటు చెర్రీ, ఉపాస‌న కూడా హాజ‌ర‌య్యారు. నూత‌న దంప‌తుల‌తో చెర్రీ, ఉపాస‌న క‌లిసి దిగిన ఓ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.ఈ ఫోటోలో వెంకటేష్‌, ఆయ‌న శ్రీమ‌తి కూడా ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం జ‌రిగిన సంగీత్‌లో స‌మంత‌, చైతూలు త‌మ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేశార‌ట‌. త్వ‌ర‌లో టాలీవుడ్ సెల‌బ్రిటీల కోసం హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఆశ్రిత‌, వినాయ‌క్ ల నిశ్చితార్ధం ఫిబ్ర‌వ‌రి 6న గోప్యంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.
20906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles