చెఫ్‌గా మారిన చెర్రీ

Wed,September 26, 2018 09:30 AM
ram charan turns to chef

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 12వ చిత్రంగా బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ యూర‌ప్‌లోని అజ‌ర్ బైజాన్‌లో జ‌రుగుతోంది.మాములుగా షూటింగ్స్‌తో బిజీగా ఉండే చెర్రీకి ఉపాస‌న ఎప్పుడు త‌న కంపెనీ ఇస్తుంటుంది. ఈ క్ర‌మంలో ఉప్సీ రీసెంట్‌గా యూర‌ప్‌కి వెళ్లింది. చెర్రీ ఓ హోట‌ల్ చెఫ్‌తో క‌లిసి డిష్ త‌యారు చేస్తుండ‌గా, ఆ స‌న్నివేశాన్ని త‌న కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆరోగ్య‌క‌ర‌మైన భోజ‌నం కోసం బాయ్స్‌ని బ‌య‌ట‌కి తీసుకొచ్చారు అనే కామెంట్ పెట్టింది ఉపాస‌న‌. ఫోటోలో చెర్రీతో పాటు నిర్మాత దాన‌య్య‌, ఫైట్ మాస్ట‌ర్ క‌న‌ల్ క‌న్న‌న్‌, చెఫ్ త‌దిత‌రులు ఉన్నారు. బోయపాటి- చెర్రీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతుండ‌గా, క‌థానాయిక‌గా కియారీ అద్వానీ న‌టిస్తుంది. 90లలో చిరు నటించిన స్టేట్ రౌడీ చిత్రం టైటిల్‌ని చెర్రీ సినిమాకి పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. దీంతోపాటు రాజవంశస్థుడు, రాజమార్తాండ అనే టైటిల్స్ కూడా పరిశీలన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అక్టోబ‌ర్ 19న ద‌సరా కానుక‌గా చిత్ర టైటిల్ రివీల్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.
1928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles