స‌ల్మాన్‌కి రామ్ చ‌ర‌ణ్ సాయం..!

Fri,April 19, 2019 12:11 PM
Ram Charan to Lend his Voice for Salman Khan

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య మాంచి సాన్నిహిత్యం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ హైద‌రాబాద్‌కి వ‌స్తే చిరుని లేదంటే చ‌ర‌ణ్‌ని క‌ల‌వకుండా వెళ్ళ‌రు. మ‌రి అంత బాండింగ్ వారి మ‌ధ్య ఉంది. గ‌తంలో సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో మూవీలో స‌ల్మాన్‌కి రామ్ చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్పి త‌మ ఫ్రెండ్షిప్‌ని మ‌రింత స్ట్రాంగ్ చేసుకున్నారు. ఇక మ‌రోసారి స‌ల్మాన్‌కి చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని అంటున్నారు.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , క‌త్రినా కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందిన చిత్రం భారత్. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘ ఓడ్ టూ మై ఫాదర్’ మూవీకి మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు.ఓ దేశం, వ్యక్తి కలిసి చేసే ప్రయాణమే ఈ ‘భారత్’. సల్మాన్‌ సోదరి పాత్రలో మరో హీరోయిన్ దిశా పటానీ సందడి చేయనున్నారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మూవీని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తెలుగు భాష‌లో సినిమాని విడుద‌ల చేస్తే స‌ల్మాన్ పాత్రిక రామ్ చ‌ర‌ణ్‌తో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

భార‌త్ చిత్రంలో స‌ల్మాన్ వివిధ గెటప్స్‌లో సంద‌డి చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే స‌ల్మాన్‌కి సంబంధించి ప‌లు లుక్స్ విడుద‌ల చేసిన యూనిట్ భారీ అంచ‌నాలు పెంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల సమాహారంగా భార‌త్‌ని తెరకెక్కించారు. అలీ అబ్బాస్ జాఫర్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందిన సుల్తాన్, టైగర్ జిందా హై చిత్రాలు మంచి విజ‌యాలు సాధించ‌డంతో భార‌త్‌తో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

2448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles